Monday, November 18, 2019
Follow Us on :

రాజ్ కోట్ లో రోహిత్ శర్మ రుద్రవీణ..!

By BhaaratToday | Published On Nov 8th, 2019

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టీ-20లో బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. బౌలర్ రావడం.. రోహిత్ శర్మ దెబ్బకు బంతి బౌండరీ చేరడం. మొదటి వన్డే ఓటమికి ప్రతీకారం ఈ రేంజిలో ఉంటుందా అని బంగ్లాదేశ్ ఆటగాళ్లకు అసలు అర్థం కాలేదు. రోహిత్ శర్మ (43 బంతుల్లో 85; 6×4, 6×6) అద్భుత ఇన్నింగ్స్ తో భారత్ కు విజయాన్ని అందించాడు. రాజ్ కోట్ టీ20లో రుద్రవీణ మోగించాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ 31 పరుగులతో రాణించాడు. కేఎల్ రాహుల్ (8), శ్రేయాస్ అయ్యర్ (24) మరో 26 బంతులు మిగిలుండగానే మ్యాచ్ ను ఫినిష్ చేశారు.

బంగ్లాదేశ్ జట్టు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ (29), మహ్మద్ నయీం (36) శుభారంభాన్ని అందించారు. సౌమ్య సర్కారు 30, కెప్టెన్ మహ్మదుల్లా 30 పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లలో చాహల్ 2, చహర్, ఖలీల్ అహ్మద్, సుందర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను 1-1తో సమం చేసింది. మూడో టి20 మ్యాచ్ నవంబరు 10న నాగ్ పూర్ లో జరగనుంది.