Monday, November 18, 2019
Follow Us on :

ఇమ్రాన్ ఖాన్ కు ఊహించని ఆఫర్ ఇచ్చిన రాజ్ నాథ్ సింగ్

By BhaaratToday | Published On Oct 15th, 2019

పాకిస్తాన్ పై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరోసారి విరుచుకుపడ్డారు. పాక్ ప్రాధాని చేస్తున్న పరుష వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు రాజ్ నాథ్. పాకిస్తాన్ తమ ఆలోచనా విధానం మార్చుకోవాలని హెచ్చరించారు. లేదంటే ఆ దేశం ముక్కలుగా విడిపోవాల్సి వస్తుందని అన్నారు. హర్యానా ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన రాజ్ నాథ్.. ఇమ్రాన్ కు ఓ సలహా కూడా ఇఛ్చాడు. ఇమ్రాన్ ఖాన్ నిజంగా ఉగ్రవాదంపై పోరాడేందుకు సిద్ధంగా వుంటే.. సహకరించేందుకు భారత్ సిద్ధంగా వుందని తెలిపారు. ఈ విషయమంలో ఒకవేళ సైనిక సహకారం కోరితే, చేసేందుకు రెడీగా వున్నామని అన్నారు. ఇప్పటికీ, ఇమ్రాన్ పదేపదే కశ్మీర్ గురించి మాట్లాడుతున్నాడని.. దాని గురించి మరిచిపోవడం మంచిదని అన్నారు. ఇమ్రాన్ ఎంత ఆలోచించినా ఏం జరగదని.. తమపై ఎవరూ ఒత్తిడి తెచ్చినా తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. 1947లో మీరు భారత్‌ను రెండుగా విడగొట్టారు. ఆ తర్వాత 1971లో మీ దేశం రెండు ముక్కలైందని.. ఇప్పుడు మళ్లీ సందర్భం వస్తే మీ దేశం విడిపోయే పరిణామాలను ఏ శక్తీ ఆపలేదని హెచ్చరించారు రాజ్ నాథ్.