Monday, November 18, 2019
Follow Us on :

రాజుగారి గది 3.. అక్టోబర్ 18న విడుదల.. అంచనాలు అందుకునేనా..!

By BhaaratToday | Published On Oct 17th, 2019

హర్రర్ బ్యాక్ డ్రాప్ లో మూడవ సీక్వెల్ గా వస్తున్న చిత్రం రాజుగారి గది 3...ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అవికాగోర్ , అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు...ఈ చిత్రాన్ని అక్టోబర్ 18 న విడుదల చేయనున్నారు..

ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది సినిమాకు సీక్వెల్ లో భాగంగా రాజుగారి గది- 3 తెరకెక్కింది.  ఓక్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓంకార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం రాజుగారిగది - 3.. ఈ చిత్రాన్ని అక్టోబర్ 18 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు...రాజుగారి గది సినిమా కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి...

ఓంకార్ రాజుగారిగది చిత్రానికి సీక్వెల్ గా తీసిన రాజుగారి గది 2 అనుకున్నంత రేంజ్ లో ఆడకపోయిన దాని ఎఫెక్ట్ రాజుగారి గది - 3 పై పడుకుండా చూసుకున్నారు....అంతే కాదు ఇటీవలె విడుదలైన ట్రైలర్ కుడా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది..ట్రైలర్ మొత్తం చాల తక్కువ డైలాగ్ లతో కట్ చేశారు... ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది...

ఇక ట్రైలర్ లో నాగ్ అశ్విన్ తన తలను అటు ఇటు తిప్పే సన్నివేశం నెట్ లో హల్ చల్ చేస్తోంది... అశ్విన్ ఫాలో అవడానికి ఇప్పటికే చాలా మంది టిక్ టాక్ లో వీడియోల రూపకల్పన చేస్తున్నారు... ఇప్పుడు అదే సీన్ నెట్ లో వైరల్ గా మారింది...  ఇక ఈ సినిమాలో అవికా గోర్ కుడా భయపెట్టే విధంగా తయారు చేశారు మేకర్స్... ఈ సీక్వెల్ కొంచెం హర్రర్ ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని కన్వే చేశారు...

అక్కడక్కడ కామెడీ యాక్టర్లను కుడా చూపించారు... సో ఈ సినిమా కుడా ముందు వచ్చిన రెండు సినిమాలలాగనే హర్రర్ కామెడీ జోనర్ లో రానుంది...ఇక తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది.. ఇక రాజుగారిగది - 3 ను  అక్టోబర్ 18న గ్రాండ్ గా విడుదల చేయడానికి సిద్దం చేశారు...ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు....