Monday, November 18, 2019
Follow Us on :

రామ జన్మ భూమి విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్

By BhaaratToday | Published On Oct 19th, 2019

అతి త్వరలో రామ జన్మ భూమికి సంబంధించిన తీర్పు వెల్లడి కానుంది. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు అయోధ్యలో దీపావళి జరుగుతుందని హిందూ బంధువులు భావిస్తున్నారు. ఇక రామ జన్మ భూమి తీర్పు విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక వ్యాఖ్యలు చేసింది. హిందువులకు అనుకూలంగా రామ జన్మ భూమి తీర్పు వెలువడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది ఆర్ఎస్ఎస్. 

ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రెటరీ భయ్యాజీ జోషి మాట్లాడుతూ నవంబర్ నెలలో ఎప్పుడైనా సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వచ్చునని.. హిందువులకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.  భువనేశ్వర్ లో అఖిల భారతీయ కార్యకారి మండల్ మూడు రోజుల సమావేశాల ముగింపు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యవర్తిత్వం కారణంగానే రామ జన్మ భూమి వివాదం ఓ కొలిక్కి వస్తుందంటే అంతకన్నా మంచి తరుణం మరేదీ లేదని ఆయన అన్నారు. అలాగే ఎన్ఆర్సి ని ప్రతి ప్రభుత్వం అమలు చేయాలని ఆయన సూచించారు. వెస్ట్ బెంగాల్ లో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని.. హిందువులకు రక్షణ కల్పించడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన అన్నారు.