Friday, July 19, 2019
Follow Us on :

దేశాన్ని రక్షిస్తానన్న చంద్రబాబుకు సవాల్ విసిరిన బీజేపీ నేత

By BhaaratToday | Published On Mar 30th, 2019

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. జాతీయ నాయకులను ఆంధ్రప్రదేశ్ కు తీసుకొని వచ్చి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఇటీవల కడప ప్రచారంలో చంద్రబాబు నాయుడు భారత ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు తినే దానిపై మోదీకి ఎందుకు అంత ఇబ్బంది అని అన్నారు. అంతేకాకుండా ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా మోడీ వైఖరిని తప్పుబట్టారు. అంతేకాకుండా తాను దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడుకు ఓ సవాల్ ను కూడా విసిరారు.  

Image result for ram madhav chandrababu naidu

దేశాన్ని రక్షిస్తానని చెబుతున్న చంద్రబాబునాయుడు తొలుత రాష్ట్రంలో గెలిచి చూపించాలని రాంమాధవ్ సవాలు విసిరారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో అసమర్థ, అవినీతి, కుటుంబ పాలన నడుస్తోందన్నారు. దేశాన్ని రక్షిస్తానంటూ తిరుగుతున్న చంద్రబాబు తొలుత ఈ ఎన్నికల్లో గెలిచి చూపించాలన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మోదీయేనని, దేశ ప్రజలంతా ఆయన వెంటే ఉన్నారని రాంమాధవ్ పేర్కొన్నారు. మోదీని తమ ప్రాంతం నుంచి పోటీ చేయాల్సిందిగా అన్ని ప్రాంతాల ప్రజలు కోరుతున్నారన్నారు రాంమాధవ్.