Sunday, August 25, 2019
Follow Us on :

ఆ ఘటనను గుర్తుపెట్టుకునే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఈ వ్యాఖ్యలు

By BhaaratToday | Published On Jul 15th, 2019

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ఎందుకు ఓడిపోయిందో కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజలు టీడీపీ పాలనలో విసిగిపోయారని.. అందుకే అధికారం లేకుండా చేశారని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం తానా సభలలో మాత్రమే ఆ పార్టీ మిగులుతుందని రామ్ మాధవ్ అన్నారు. టీడీపీకి రోజులు దగ్గరపడ్డాయని..రానున్న రోజుల్లో భూస్థాపితం కావడం ఖాయమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే వైసీపీని గెలిపించడానికి కారణాలను కూడా ఆయన చెప్పుకొచ్చారు. 

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. పెనం నుంచి పొయ్యిలో పడేందుకు కూడా టీడీపీకి అవకాశం కూడా ఇవ్వరాదని హెచ్చరించారు. 2024 నాటికి ఏపీలో అధికార పార్టీ దిశగా బీజేపీ ఎదగాలని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఏపీలోని అత్యధిక ప్రజలను బీజేపీ వైపు ఆకర్షించేట్లు చూడాలని, దేశం మొత్తం మీద వచ్చిన ఆదరణను ప్రేరణగా తీసుకొని ఏపీలో బలపడాలని రాష్ట్ర నాయకత్వానికి ఆయన సూచించారు. పార్టీ అధిష్ఠానం ఆశించినంత మేర ఏపీలో ఓట్లు రాలేదని, అందుకే బలపడేందుకు ప్రతీ కార్యకర్తా ఛాలెంజింగ్‌గా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

తానా సభలకు అతిథిగా వెళ్లిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. వేదికపై ఆయన ప్రసగిస్తుండగా ప్రధాన నరేంద్ర మోదీ గురించి ప్రస్తావించారు. ఈ సమయంలో పలువురు మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పదే పదే ఆయన ప్రసంగానికి అడ్డుతగులుతూ ఇబ్బంది కలిగించారు. రామ్ మాధవ్ తన ప్రసంగాన్ని ఆపేయాలని బీజేపీకి వ్యతిరేకంగా కొందరు నినదించారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకుంది. రామ్ మాధవ్ తన ప్రసంగాన్ని మాత్రం కొనసాగించారు. ఆ ఘటనను గుర్తు పెట్టుకునే టీడీపీ తానా సభల్లో మాత్రమే మిగిలి ఉంటుందని రామ్ మాధవ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారేమో..!