Thursday, November 14, 2019
Follow Us on :

వ్య‌వ‌సాయం చేసుకుంటా.. పెరోల్ మంజూరు చేయండి

By BhaaratToday | Published On Jun 21st, 2019

జీవిత ఖైదు అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీం సింగ్ పెరోల్‌ కోసం దరఖాస్తు చేశారు. సిర్సాలోని తన భూమి ఖాళీగా ఉండిపోయిందని, తాను ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటానని, తనకు పెరోల్ మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన సునరియా జైలు అధికారులకు దరఖాస్తు చేశారు.
 
రామ్ రహీం ఓ పాత్రికేయుడి హత్య కేసులో జీవిత ఖైదు, అత్యాచారం కేసులో 20 ఏళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన ప్రస్తుతం జైలులో తోటమాలిగా పని చేస్తున్నారు. పాత్రికేయుడు రామ్‌చందర్ ఛత్రపతి 2002 అక్టోబరులో హత్యకు గురయ్యారు. ఈ కేసుపై విచారణ జరిపిన పంచకులలోని ప్రత్యేక సీబీఐ కోర్టు రామ్ రహీంకు జీవిత ఖైదు విధించింది. అలాగే.. ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్లు రుజువు కావడంతో రామ్ రహీంకు 2017 ఆగస్టులో 20 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. రామ్ రహీం పెరోల్ దరఖాస్తు జిల్లా అధికారుల ద్వారా హర్యానా రాష్ట్ర ప్రభుత్వానికి చేరిందని అధికారులు తెలిపారు.