Monday, December 16, 2019
Follow Us on :

రామాయణం సినిమా కోసం ఏకంగా 1500 కోట్ల భారీ బడ్జెట్..!

By BhaaratToday | Published On Jul 9th, 2019

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయి.. హాలీవుడ్ లో అయితే భారీ బడ్జెట్ తో రూపొందినవి తెలుగులో కూడా డబ్ చేస్తుంటారు. అవేమీ మరీ అంత గొప్ప సబ్జెక్టు ఉన్న సినిమాలు కాకపోవచ్చు.. కానీ విజువల్ వండర్ గా తీర్చిదిద్దడం వలన అవి చాలామందికి నచ్చేలా ఉంటాయి. ఇకపోతే మన రామాయణ, మహాభారతాలను విజువల్స్ పరంగా అద్భుతంగా తీర్చిదిద్దితే అవెంజర్స్, అవతార్ సినిమాలు ఎక్కడికి వెళ్ళాలో..! ఇప్పుడు అదే పనిలో పడ్డారు మన నిర్మాతలు.

ఏకంగా 1500 కోట్ల రూపాయలతో రామాయణాన్ని రూపొందించడానికి తొలి అడుగు పడింది. రామాయణాన్ని మూడు భాగాలుగా 3డి టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సిద్ధమయ్యారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఈ రామాయణాన్ని తెరకెక్కించనున్నారు. ఈ భారీ చిత్రం నిర్మాణం కోసం మధు మంతెన, నమిత్ మల్హోత్ర (ప్రైమ్ ఫోకస్)తో అల్లు అరవింద్ జతకట్టారు. మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి, ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యవార్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారు. తొలి భాగం 2021లో విడుదలవుతుందంటూ అధికారిక ప్రకటన వెలువడింది. భారీ రేంజిలో సినిమాను రూపొందిస్తున్నారు కాబట్టి.. స్టార్స్ కి కూడా సినిమాలో కొదవే లేదు.