Saturday, October 19, 2019
Follow Us on :

మచ్చా.. కంగ్రాచులేషన్స్ అంటూ ఆర్యకు విషెష్ చెప్పిన రానా..!

By BhaaratToday | Published On Feb 14th, 2019

తమిళ నటుడు ఆర్య.. ‘అఖిల్‌’ హీరోయిన్ సయేషా సైగల్ ను పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయాన్ని  అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు ఆర్య. వీరి పెళ్లి విష‌యంపై క్లారిటీ ఇచ్చింది. స‌యేషా, ఆర్యలు త‌న ట్విట్ట‌ర్‌లో వ్యాలంటైన్స్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. మార్చిలో తాము వివాహం చేసుకోబోతున్న‌ట్టు తెలిపారు. మీ అంద‌రి అభిమానం, ఆశీర్వాదం కావాల‌ని కూడా కోరారు. అయితే వారి ట్వీట్ పై రానా దగ్గుబాటి స్పందించాడు. మచ్చా.. కంగ్రాచులేషన్స్.. సింగిల్ గా చివరి ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నావు అని ట్వీట్ చేసాడు.   


అఖిల్ సినిమాలో నటించాక.. బాలీవుడ్ లో శివాయ్ సినిమాలో నటించింది సయేషా సైగల్. ఆ తర్వాత 2017లో ‘వనమగన్‌’ చిత్రంతో తమిళంలోకి అడుగుపెట్టింది సయేషా. ఇప్పుడు సూర్యకు జోడీగా ‘కాప్పాన్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ‘గజినికాంత్‌’ చిత్రంలో ఆర్య, సాయేషా కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది.