Wednesday, October 16, 2019
Follow Us on :

స్పీడు పెంచిన 'రానా'

By BhaaratToday | Published On Feb 20th, 2019

రానా దగ్గుబాటి ఇప్పటికే పలు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. రానా ప్రస్తుతం 5 సినిమాలకు పని చేస్తున్నాడంటే ఎంత స్పీడ్ మీద ఉన్నాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సినిమాల్లో నటించడం మాత్రమే కాదు కొత్త ప్రాజెక్టులను లైన్లో పెట్టడంలో కూడా రానా తన జోరు చూపిస్తున్నాడు. తాజాగా రానా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళంలో సిద్దార్థ్ హీరోగా 'అవల్'(తెలుగు లో 'గృహం') సినిమాను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న దర్శకుడు మిలింద్ రాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను ఈ రోజే అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఈ సినిమాకు ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట.. దర్శకుడు ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ కు ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాడట. మరి ఇది కూడా 'గృహం' తరహాలోనే ఒక హారర్ సినిమానా కదా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.