Monday, November 18, 2019
Follow Us on :

బాలీవుడ్ సినిమాలో రష్మిక..?

By BhaaratToday | Published On Apr 26th, 2019

రష్మిక మందన.. ఈ కన్నడ 'కిరిక్ పార్టీ' సంచలనం.. ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు మొత్తం సౌత్ లోనే క్రేజీ హీరోయిన్. రష్మిక మందన ప్రస్తుతం తెలుగు, తమిళం ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉంది. అయితే ఇప్పుడు రష్మికకు బాలీవుడ్ ఆఫర్ కూడా లభించింది.సంజయ్ లీలా భన్సాలీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ప్రాజెక్టులోకి రష్మికను అడిగారట..! రణ్ దీప్ హుడాకు జోడీగా రష్మిక నటించే అవకాశాలు ఉన్నాయి. రష్మికతో చిత్ర నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.. రష్మిక ఓకె అంటే బాలీవుడ్ లో రష్మికకు గ్రాండ్ లాంచ్ పక్కా..! 

Related image

ఇక అక్కినేని అఖిల్ సినిమా కోసం రష్మికను తీసుకున్నట్లు తెలుస్తోంది. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం రష్మిక మందనను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మే నెలలో ఈ ప్రాజెక్టును లాంచ్ చేసి, ఆ వెంటనే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. రష్మిక-విజయ దేవరకొండతో నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక కార్తీ సినిమాలో కూడా రష్మిక నటిస్తుండగా.. నితిన్ కు కూడా జోడీగా రష్మికనే తీసుకున్నారు.    

Related image