Tuesday, May 21, 2019
Follow Us on :

అనూహ్య పరిణామాలు.. రవి ప్రకాష్ ను అరెస్ట్ చేస్తారా..?

By BhaaratToday | Published On May 15th, 2019

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలిచారు. ఆయన అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ టీవీ9 యాజమాన్యం ఆయన్ను విధుల నుండి తొలగించింది. మొదట ఆయన అవినీతి గురించి వార్తలు రాగానే.. టీవీ 9లో అనూహ్యంగా ప్రత్యక్ష్యమయ్యారు. ఆరోజు రవి ప్రకాష్ మాట్లాడుతూ తప్పుడు కేసులు నిలబడవు, అవాస్తవాలు నిలబడవు, సత్యం మాత్రమే నిలబడుతుంది అని ఆవేశంగా చెప్పుకొచ్చారు. తాను పారిపోయినట్లు వచ్చిన వార్తలు కూడా వాస్తవాలు కావని అన్నారు. రవి ప్రకాష్ ను ఎవరూ అరెస్ట్ చేయలేదు.. అరెస్ట్ చేయబోవడం లేదు అని చెప్పారు.. కొందరు తప్పుడు కేసులు పెట్టాలని భావించారు.. అవి నిలబడవు అని ఆయన అన్నారు. 

అయితే రవిప్రకాశ్‌ తెలంగాణ హైకోర్టులో ఈరోజు ఉదయం ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని న్యాయమూర్తి తిరస్కరించారు. బుధవారం నాడు రవి ప్రకాష్ తరఫున హైకోర్టుకు హాజరైన న్యాయవాది ముందస్తు బెయిల్ ను ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తన క్లయింట్ పోలీసుల విచారణకు సహకరిస్తారని, ఆయన సంఘంలో పేరున్న వ్యక్తని, బెయిల్ ఇవ్వాలని కోరగా, ధర్మాసనం తిరస్కరించింది. వెంటనే పోలీసుల ఎదుట హాజరు కావాలని సూచించింది. సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు పంపినా, గడువులోగా రవి ప్రకాష్ స్పందించక పోవడంతో అరెస్ట్ తప్పేలా కనపడడం లేదు.