Saturday, October 19, 2019
Follow Us on :

అదం పాతాళానికి అనిల్ అంబానీ..! ఘోరంగా పడిపోయిన షేర్లు..!!

By BhaaratToday | Published On Feb 6th, 2019

అనిల్‌ ధీరుభాయ్‌ అంబానీ గ్రూపునకు చెందిన కీలకమైన కంపెనీల షేర్లు మార్కెట్లో ఘోరంగా పడిపోయాయి. ఈ వారం తొలి ట్రేడింగ్‌ సెషన్‌ నుంచి మొదలైన ఈ పతనం నేడు మరింత వేగవంతమైంది. ఒక దశలో ఆర్‌కామ్‌ షేరు ధర ముఖవిలువ రూ.5 కంటే  దిగువకు చేరింది. నేడు రిలయన్స్‌ ఇన్ఫ్రా దాదాపు 27శాతం పతనమైంది. ట్రేడింగ్‌ వాల్యూమ్‌కూడా ఐదింతలు పెరగటం మదుపరులను ఆందోళనకు గురిచేసింది. దాదాపు 32.55 మిలియన్ల వాటాలు చేతులు మారాయి. ఈ మొత్తం కంపెనీలోని 12.6శాతంకు సమానం. ప్రమోటర్ల షేర్లు తనఖాలోకి వెళ్లడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఒకప్పుడు టెలికాం రంగంలో ఒక వెలుగు వెలిగిన ఆర్‌కామ్‌ పరిస్థితి దయనీయంగా మారింది. ఈ షేరు విలువ నేడు ఒక దశలో 11శాతం కుంగి రూ.4.85కు చేరింది. ఇది ముఖ విలువ  కంటే తక్కువ. కేవలం మూడు ట్రేడింగ్‌ సెషన్లలోనే ఆర్‌కామ్‌ 58శాతం విలువ కోల్పోవడం విశేషం. దివాల ప్రక్రియకు సంబంధించి ఆర్‌కామ్‌ శుక్రవారం సాయంత్రం చేసిన ప్రకటనతో ఈ పరిస్థితి తలెత్తింది. రిలయన్స్‌ పవర్‌ 14శాతం పడిపోయి రూ.10.30కు చేరింది. రిలయన్స్‌ హోం ఫైనాన్స్‌ 12శాతం కుంగి 31.55 వద్దకు, రిలయన్స్‌ నేవల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ 11 శాతం కుంగి 7.75 మార్కును తాకాయి. అడాగ్‌ గ్రూప్‌లోని ఆరు  లిస్టెడ్‌ కంపెనీలు కలిపి 25-61శాతం వరకు విలువ కోల్పోయాయి. ఒక్క రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ పరిస్థితి మాత్రం కొంత ఫరవాలేదు.