Saturday, October 19, 2019
Follow Us on :

భారీ సంఖ్యలో ఉగ్రవాదులు ప్రవేశించే అవకాశం.. రెడ్ అలర్ట్..!

By BhaaratToday | Published On Aug 14th, 2019

పాకిస్థాన్ నుండి భారత్ లోకి తీవ్రవాదులు పెద్ద ఎత్తున ప్రవేశించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బోర్డర్ లో పెద్ద ఎత్తున తీవ్రవాదులు మకాం వేశారు.. పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల్లో టెర్రరిస్టు క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ క్యాంపుల్లో ఉన్న టెర్రరిస్టులకు పాక్ సైన్యం అండగా ఉంది. సరిహద్దుల్లో 150కి పైగా ఉగ్రవాదులు మకాం వేసినట్టు భరత ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. వీరిలో జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ సోదరుడు ఇబ్రహీం అత్తర్ ఉన్నట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం గుజరాత్‌ రాష్ట్రం కచ్‌ సరిహద్దులో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. భారీ సంఖ్యలో ఉగ్రవాదులు ఈ ప్రాంతం గుండా భారత్‌లోకి వ్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారట..! ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు భారత్‌ సరిహద్దులో భారీగా బలగాలను మోహరించింది. రాష్ట్ర, నావికాదళం, సరిహద్దు పోలీసులు అణువణువూ జల్లెడ పడుతున్నారు. అవాంఛనీయ పరిస్థితి తలెత్తకుండా  మెరైన్‌, బోర్డన్‌ పోలీసులను భారీగా తరలించారు. వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పద వాహనాలు, పడవలు, వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు సూచించారు.