Wednesday, October 16, 2019
Follow Us on :

2018లో డ్రంకెన్ డ్రైవ్ కేసులు త‌గ్గాయ‌ట‌...ఎందుకో తెలుసా...?

By BhaaratToday | Published On Jan 20th, 2019

మ‌ద్యం తాగి వాహనాలు నడపవద్దని ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా విన‌లేదు. ఆపై భారీ జరిమానాలు, చిన్నపాటి జైలుశిక్షలు విధించినా ఏ మాత్రం మార్పురాలేదు. చివరకు రాచకొండ పోలీసులు తీసుకున్న ఓ నిర్ణయం మందుబాబులను మార్చింది. ముఖ్యంగా విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల మనసు మార్చింది. ఇంతకీ పోలీసులు తీసుకున్న నిర్ణయం ఏంటోన‌ని అనుకుంటున్నారా..? మందు కొట్టి బండి నడుపుతూ పట్టుబడిన విద్యార్థి కానీ, పాఠశాలకు, ఉద్యోగి అయినా ఉన్నతాధికారికి లేఖలు రాయడం ప్రారంభించారు. అంతే, వారి కార్యాల‌యాల్లో విచిత్రంగా చూడటం, కళాశాలలో యాజమాన్యాలు తల్లిదండ్రులను పిలిపించి వారి ముందే చివాట్లు పెట్టడంతో పరువు పోయిందని భావించి మారిపోయారు.


2017లో 8,015 డ్రంకెన్ డ్రైవ్ కేసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో నమోదుకాగా, 2018లో ఆ సంఖ్య 5,692కు తగ్గింది. ఈ విషయాన్ని స్వయంగా రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వెల్ల‌డించారు. ప‌ట్టుబడిన వారికి కౌన్సెలింగ్, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు తదితర ఎన్నో చర్యలు తీసుకున్నా కనిపించని ఫలితాలు, వారి ఘనకార్యాన్ని చెబుతూ, లేఖలు రాయడం ప్రారంభమైన తరువాత కనిపిస్తోందని చెప్పుకొచ్చారు.