Saturday, August 24, 2019
Follow Us on :

జగన్, నవీన్ పట్నాయక్, మాయావతి, స్టాలిన్.. తీసుకోబోయే నిర్ణయం..!

By BhaaratToday | Published On May 21st, 2019

ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి.. ఇంకొన్ని గంటల్లో ఫలితాలు కూడా వచ్చేయబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అధిష్టానాలు ప్రాంతీయ పార్టీలను ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నాయి. తమ కూటముల్లో లేని పార్టీలతో ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టగా.. ఫలితాలు వచ్చాక ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో, అధికారానికి ఎవరి కూటమి దగ్గరగా ఉందో తెలుసుకున్న తరువాతే కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఉత్తర ప్రదేశ్ లో బీఎస్పీ అధినేత్రి మాయావతి, తమిళనాడులో డీఎంకే నేత స్టాలిన్ తదితరులు ఫలితాల తరువాతే ఓ నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు. 100కు పైగా ఎంపీ స్థానాలను ప్రాంతీయ పార్టీలు గెలిస్తే, బీజేపీనైనా, కాంగ్రెస్ నైనా శాసించవచ్చు. ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినట్లుగానే రిజల్ట్ కూడా వస్తే మాత్రం ప్రాంతీయ పార్టీల నాయకులు ఏ పార్టీకి మొగ్గు చూపుతారనేది హాట్ టాపిక్ అయింది. జగన్, నవీన్ పట్నాయక్, మాయావతి, స్టాలిన్ లు తీసుకోబోయే నిర్ణయం ఏమిటన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఇక ఫెడరల్ ఫ్రంట్ కు ఛాన్స్ ఉంటుందా లేదా అన్నది కొన్ని గంటల్లో తెలిసిపోనుంది.