Tuesday, May 21, 2019
Follow Us on :

కేటీఆర్ అన్న న‌న్ను కాపాడుండ్రీ

By BhaaratToday | Published On May 15th, 2019

• 20 రోజుల నుంచి స‌రిగ్గా తిండి లేదు
• సౌదీ నుంచి తెలంగాణ వాసి ట్విట‌ర్‌లో కేటీఆర్‌కు వీడియో సందేశం

‘కేటీఆర్’ అన్న నన్ను ఎలాగైన రక్షించు..ట్విట‌ర్‌లో వీడియో సందేశం
ఏజెంట్ల మోసానికి మరో తెలంగాణ యువకుడు బలి అయ్యాడు. ఏడారి దేశం సౌదీలో చిక్కుకుని కష్టాలు పడుతున్నాడు. అయితే త‌న‌ను ఎలా గైన ర‌క్షించాలంటూ టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ క‌మిటీ ప్ర‌సిడెంట్‌ కేటీఆర్‌ను ఓ వీడియోలో సందేశంలో వేడుకొన్నాడు. కరీంనగర్‌ జిల్లా ఇల్లంతకుంటకు చెందిన 21 ఏళ్ల మహ్మద్‌ సమీర్‌ జీవనోపాధి కోసం గత నెలలో సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఫంక్షన్‌ హాల్లో పని ఇప్పిస్తానని నిజామాబాద్‌కు చెందిన ఓ ఏజెంటు ఆశ చూపి మోస‌గించాడు. ఆ ఉద్యోగం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని ఆశ‌ప‌డ్డ స‌మీర్ చివ‌ర‌కు న‌ర‌క‌యాత‌ను అనుభ‌విస్తున్నాడు. అయితే ఈ వీడియోలో ప‌లు విష‌యాలు వెల్ల‌డించాడు స‌మీర్‌. ఏజెంటుకు రూ.80వేలు చెల్లించాన‌ని, తీరా అక్కడికి వెళ్లాక ఆశలు అడియాశలయ్యాయ‌ని క‌న్నీరుమున్నీర‌య్యాడు. తనను గొర్రెల కాపరిగా పెట్టారని, ఎలాగైనా రక్షించమంటూ వీడియో సందేశం ద్వారా సమీర్‌ కోరాడు. బాధితుడి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు స్పందించిన కేటీఆర్‌ సమీర్‌ను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.