
దేశ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఏపీలోని అనంతపురం జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగిలేలా కనిపిస్తుంది. జిల్లాలో టీడీపీ వెనుకంజలో ఉంది. రాప్తాడులో పరిటాల రవి మంత్రి సునీతల తనయుడు పరిటాల శ్రీరామ్ వెనుకంజలో ఉన్నారు. పరిటాల శ్రీరామ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు. అనంతపురం అర్బన్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అనంతవెంకట్రామిరెడ్డి 1000 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఉరవకొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు.