Tuesday, May 21, 2019
Follow Us on :

మల్కాజిగిరి బ‌రిలో రేవంత్‌రెడ్డి

By BhaaratToday | Published On Mar 16th, 2019

కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు ఎనిమిది మంది అభ్యర్థులను శుక్ర‌వారం రాత్రి ప్రకటించింది. మరో తొమ్మిది స్థానాలకు శని, ఆదివారాల్లో ఖరారు చేయనుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలలోని సామాజిక సమీకరణాలు, శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం, అధికార పార్టీ అభ్యర్థి ఎవరవుతారు.. ఎవరైతే వారిని ధీటుగా ఎదుర్కొనగలరనే అంశాలపై చర్చించారు. అనంతరం 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. 

ఈ నేఫ‌థ్యంలో అధిష్ఠానం సూచన మేరకు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శుక్ర‌వారం ఢిల్లీ వెళ్లారు. పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు. మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని ఆజాద్‌.. రేవంత్‌రెడ్డికి సూచించారు. అధిష్ఠానం సూచన మేరకు పోటీ చేస్తానని.. అదే సమయంలో గత శాసనసభ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని హామీలు ఇచ్చిన వారికి న్యాయం చేయాలని కోరారు. నల్గొండ నుంచి పటేల్‌ రమేశ్‌రెడ్డి, జహీరాబాద్‌ నుంచి సుభాష్‌రెడ్డికి కచ్చితంగా టిక్కెట్‌ ఇవ్వాలని కోరారు. అందుకు ఆయన.. తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.