Monday, September 23, 2019
Follow Us on :

రేవంత్ రెడ్డి సెటైర్లు.. అందులో మాత్రం తెలంగాణ నెంబర్ వన్

By BhaaratToday | Published On Sep 2nd, 2019

వికారాబాద్ జిల్లా లక్ష్మీదేవిపల్లిలో జలసాధన సభలో ఎంపీ రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై పలు సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని ఆయన అన్నారు. తెలంగాణను కేసీఆర్ దేనిలోనూ అభివృద్ధి చేయలేదని.. మద్యం అమ్మకాల్లో, నిరుద్యోగంలో మాత్రం తెలంగాణను నెంబర్ వన్ చేశారంటూ తనదైన శైలిలో ధ్వజమెత్తారు. 

కేసీఆర్ కరెన్సీ మూటల మత్తులో ఫామ్ హౌస్ లో కులుకుతున్నారంటూ విమర్శించారు. ఈటల వ్యవహారంతో టీఆర్ఎస్ లో తిరుగుబాట్లు మొదలయ్యాయని అన్నారు. దమ్ముంటే ప్రాజెక్టులపై చర్చకు రావాలంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఏడాదిలో నీళ్లు ఇవ్వకపోతే టీఆర్ఎస్ పతనం మొదలైనట్టేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.