Sunday, August 25, 2019
Follow Us on :

చినజీయర్ స్వామిని కలిసి గోడు వెళ్లబోసుకున్న రెవెన్యూ ఉద్యోగులు!

By BhaaratToday | Published On Apr 14th, 2019

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారంటూ  ఒక వైపు విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామిని కలిసి తమ గోడు వెళ్లబోసుకోవడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. రెవెన్యూ శాఖ విలీనం ప్రతిపాదన విరమించుకోవాలని, రద్దు ఆలోచనలు చేయొద్దని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చినజీయర్ ను కలిసిన రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమను ఎలాగైనా కాపాడాలని కోరారట. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి తమ ఆవేదన చెప్పుకుందామంటే అనుమతి లభించడంలేదని వారు వాపోయారట. 

గత కొన్నిరోజులుగా రెవెన్యూ శాఖ రద్దుపై ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని వీఆర్వోల సంఘం ప్రతినిధులు తెలిపారు. రెవెన్యూ శాఖను రద్దు చేయడం కంటే మార్పులు చేస్తే బాగుంటుందని వారు చిరజీయర్ స్వామి ముందు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. తెలంగాణ రెవెన్యూ శాఖకు 200 ఏళ్ల చరిత్ర ఉందని, ఇప్పుడు రద్దు చేయడం సరికాదని పేర్కొన్నారు. కేసీఆర్ ను కలవడానికి విఫలయత్నాలు చేశామని, అందుకే తమను ఆదుకుంటారన్న ఉద్దేశంతో చినజీయర్ స్వామిని కలిశామని రెవెన్యూ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.