Friday, December 06, 2019
Follow Us on :

చంద్రబాబు నాయుడును బ్రహ్మానందంతో పోల్చారే..!

By BhaaratToday | Published On Jul 11th, 2019

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే..! ఈరోజు ఉదయం నుండి వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉండగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పగలబడి నవ్వారు. అంతే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ప్రత్యక్షమయ్యాడు. చంద్రబాబు నాయుడిని బ్రహ్మానందంతో పోల్చారు ఈ వివాదాస్పద దర్శకుడు. 

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడిన ప్రతీసారి ముఖ్యమంత్రి జగన్ నవ్వుల్లో మునిగిపోతున్నారని.. సినిమా తెరపై బ్రహ్మానందం వచ్చినప్పుడు మాత్రమే జనాలు ఇలా నవ్వడాన్ని తాను చూశానన్నారు. టీడీపీ ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో కామెడీ ట్రాక్ గా మారిపోయిందని ట్వీట్ చేశాడు ఆర్జీవీ.