Tuesday, October 15, 2019
Follow Us on :

స్వర్గం నుంచి ఎన్టీఆర్..! 24 నిమిషాల్లో విడుదల..!!

By BhaaratToday | Published On Feb 1st, 2019

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలను వివరాలను ఎప్పటికప్పుడు ఆసక్తికర ట్వీట్స్‌తో వర్మ పోస్ట్ చేస్తూ సినిమాపై ఆసక్తిని తగ్గకుండా చూస్తున్నారు. తాజాగా ఆర్జీవీ ట్విటర్‌లో ఓ ఆసక్తికర ట్వీట్‌ను పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ తనను స్వర్గం నుంచి హెచ్చరించారంటూ ఆర్జీవీ వరుస ట్వీట్స్ చేశారు. ‘‘మహానాయకుడు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన 24 నిమిషాల్లోగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌ను విడుదల చేయాలని ఎన్టీఆర్ స్వర్గం నుంచి నన్ను హెచ్చరించారు. ఆయన కుమారుడు తీసిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాకు ఎన్టీఆర్ ఆశీస్సులు లభించలేదని స్పష్టమయింది. ఎన్టీఆర్ కేవలం ఆయన భార్యకు చెందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను మాత్రమే ఆశీర్వదించారు. దీనికి నిదర్శనమే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ -మహానాయకుడు సినిమాలు ముఖాముఖి తలపడటం’’ అని వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.