Wednesday, October 16, 2019
Follow Us on :

ఆయనకు ఎక్కడ దొరుకుతారో ఏమో కానీ.. ఎన్టీఆర్ పాత్ర పోషించింది ఎవరంటే..?

By BhaaratToday | Published On Jan 19th, 2019

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తొలి టీజర్ ద్వారా ఎన్టీఆర్ పాత్రదారుడిని దర్శకుడు వర్మ పరిచయం చేశారు. సోషల్ మీడియాలో పలువురు పలు రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే క్యాస్టింగ్ విషయంలో మాత్రం వర్మను తెగ పొగిడేస్తున్నారు. ఎక్కడ దొరుకుతారో ఏమో కానీ రామ్ గోపాల్ వర్మకు అచ్చుగుద్దినట్లు ఆర్టిస్టులు దొరుకుతారని నెటిజన్లు చెప్పుకొస్తూ ఉన్నారు. ఇక టీజర్ లో కనిపించిన ఎన్ఠీఆర్ ఎవరు అని ప్రజలు తెగ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఆ విషయంలో వర్మ క్లారిటీ ఇచ్చేశారు.   

 ఆ పాత్ర పోషించింది ఎవరన్న విషయాన్ని వర్మ స్పష్టం చేశారు. ఆ వ్యక్తి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రంగస్థల నటుడని చెప్పారు. ఎన్టీఆర్ లా ప్రసంగించడం, హావభావాలు పలికించడం వంటి విషయాల్లో ఆయనకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఆర్జీవీ సినిమాల రిజల్ట్  ఎలా ఉన్నా.. ఆర్టిస్టుల విషయంలో మాత్రం వంద శాతం విజయం సాధిస్తాడని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉన్నారు.