Tuesday, June 18, 2019
Follow Us on :

రిషబ్ పంత్ కు అందిన సమాచారం ఏమిటంటే

By BhaaratToday | Published On Jun 12th, 2019

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. ఆ మ్యాచ్ లో శిఖర్ ధావన్ సెంచరీతో కంగారెత్తించాడు. శిఖర్ ధావన్ కు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో బంతి చేతికి తగిలింది. ఆ దెబ్బతోనే మ్యాచ్ ఆడాడు ధావన్.. అయితే ఆ గాయం చాలా తీవ్రమైందన్నట్లు తెలుస్తోంది. ధావన్ ఆ గాయం నుండి కోలుకోడానికి మూడు వారాల సమయం పడుతుంది. అప్పటికే దాదాపు ప్రపంచకప్ పూర్తి అయిపోయినట్లే..! దీంతో ధావన్ దాదాపుగా వరల్డ్ కప్ కు దూరమైనట్లే..! అయితే ధావన్ భారత్ కు తిరిగి రావడం లేదు కానీ.. వైద్యుల పర్యవేక్షణలో అక్కడే ఉండబోతున్నాడు. 

ధావన్ కు గాయమవడంతో రిషబ్ పంత్ కు అదృష్టం కలిసి వచ్చింది. శిఖర్ ధావన్ స్థానంలో రిషబ్ పంత్ ను లండన్ కు పంపాలని బీసీసీఐ నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ మేరకు అధికారుల నుంచి పిలుపును అందుకున్న రిషబ్, లండన్ కు బయలుదేరేందుకు సన్నద్ధమవుతున్నాడు. సాధ్యమైనంత త్వరగా లండన్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్న సమాచారం పంత్ కు అందిందట..!