Monday, September 23, 2019
Follow Us on :

బ్రేకింగ్ : మహబూబ్‌నగర్‌లో ఘోర ప్రమాదం

By BhaaratToday | Published On Aug 4th, 2019

మహబూబ్ నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిడ్జిల్‌ మండలం కొత్తపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో 15 మంది ఉన్నట్లు సమాచారం. కూలీలు పనులు ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.