Tuesday, October 15, 2019
Follow Us on :

ఇంకెన్నాళ్లీ అక్రమ చొరబాట్లు.. దేశంలోకి చొరబడ్డ రోహింగ్యా ముస్లింల అరెస్ట్

By BhaaratToday | Published On Feb 4th, 2019

అక్రమంగా దేశంలోకి చొరబడ్డ రోహింగ్యాలను త్రిపురలో రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ మీదుగా భారత్ లోకి అక్రమంగా అస్సాంలోకి ప్రవేశించి.. అనంతరం నార్త్ త్రిపురలోకి ప్రవేశించారు. మొత్తం ఆరుగురు యువతులతో పాటు ఓ యువకుడిని ఆర్పీఎఫ్ సిబ్బంది ధర్మానగర్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. అయితే ఈ రోహింగ్యాలు తల దాచుకోడానికి వస్తున్నారా.. లేక భారత్ లో విపత్తులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారా అన్నది ప్రశ్నార్థకమే..! ఎందుకంటే ఈ రోహింగ్యాలు ప్రవేశించిన చాలా దేశాలు ఎన్నో ఇబ్బందుల పాలయ్యాయి. వీరిని భారత్ లోకి చొరబడనివ్వకుండా మోడీ ప్రభుత్వం కఠిన ఆంక్షలనే విధించింది. అయినా చొరబడ్డానికి  ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు. 

ఇక వీరికి ఆశ్రయం కల్పించిన బంగ్లాదేశ్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటూ ఉంది. వారి జనాభాను కట్టడి చేయడానికి చాలా కష్టాలు పడుతోంది. మయన్మార్ నుంచి వేలాదిమందిగా తరలివస్తున్న రోహింగ్యా ముస్లింల అంశం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే పెద్ద తలనొప్పిగా మారింది. వారిని ఎలా నియంత్రించాలో తెలియక తల పట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో శరణార్థి శిబిరాల్లో అంతకంతకూ పెరుగుతోన్న రోహింగ్యాల సంఖ్యపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడానికి నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ లో మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలకు ఆవాసం కల్పించారు. అధికారుల పరిశీలనలో ఒక్కొక్కరికీ 19 మంది పిల్లలు, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నట్టు గుర్తించారు. వీరికి ఎన్నిసార్లు అవగాహన కల్పించినా ప్రయోజనం లేదు. ప్రభుత్వం ఇచ్చిన గర్భనిరోధక సాధనాలు కూడా వాడటం లేదట. అందుకే మగవారికి వేసెక్టమీ లేదా మహిళలకు ట్యూబెక్టమీ చేయాల్సిందేనని బలమైన నిర్ణయానికి వచ్చినట్టు రోహింగ్యాల శరణార్థి శిబిరంలో ఫ్యామిలీ ప్లానింగ్ అధికారి తెలిపారు. అయితే ఈ ఆపరేషన్లకు రోహింగ్యా ముస్లింలు నిరాకరిస్తున్నారు. అది ఇస్లాం మతానికి వ్యతిరేకం అని, వీలైనంతమంది పిల్లలను కంటామని మొండిగా చెబుతున్నారు. ఏమి చేయాలో తెలీక బంగ్లాదేశ్ ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది. ఈ రోహింగ్యాలు భారత్ లో కూడా పలుచోట్ల చేరుకున్నారు. వారిపై కూడా ప్రభుత్వం నిఘా వేసింది.