Tuesday, September 24, 2019
Follow Us on :

రోహిత్ శర్మ నుండి వచ్చిన ఆ ఒక్క పంచ్ డైలాగ్

By BhaaratToday | Published On Jun 17th, 2019

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ మరో భారీ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో 336 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్‌ శర్మ (140) భారీ శతకం.. కోహ్లీ (77), రాహుల్‌ (57) హాఫ్‌ సెంచరీల సహాయంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 336 పరుగులు చేసింది. చివర్లో వర్షం కారణంగా పాక్‌ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302 పరుగులుగా నిర్ణయించారు. కానీ పాక్‌ ఆరు వికెట్లకు 212 పరుగులే చేసి ఓడింది. ఫఖర్‌ జమాన్‌(62), బాబర్‌ ఆజమ్‌(48), ఇమాద్‌ వసీమ్‌(46 నాటౌ ట్‌) రాణించారు. కుల్దీప్‌, విజయ్‌ శంకర్‌, హార్దిక్‌ పాండ్యాలకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రోహిత్‌ నిలిచాడు.

ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో రోహిత్ శర్మ ఇచ్చిన సమాధానం ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ఆటగాళ్లకు మరింత కాలేలా చేసింది. పాక్ ఆటగాళ్లు ఎంత చెత్తగా బ్యాటింగ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు ఒక ఆటగాడిగా మీరెలాంటి సలహా ఇస్తారని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. 

అందుకు రోహిత్ శర్మ సమాధానం చెబుతూ..  "తాను పాకిస్థాన్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించినప్పుడు వారికి తప్పకుండా టిప్స్ అందిస్తానన్నాడు.  ఎందుకంటే ఇది పాకిస్థాన్ కోచ్ జవాబు చెప్పాల్సిన ప్రశ్న, దీనికి నేనేం సమాధానం చెబుతాను?"  అంటూ పంచ్ డైలాగ్ వేశాడు. అంతే మీడియా సమావేశంలో నవ్వులే నవ్వులు..! ఇక భారత అభిమానులు కూడా ఈ పోస్టును విపరీతంగా వైరల్ చేస్తున్నారు.