Tuesday, May 21, 2019
Follow Us on :

కోహ్లీ కంటే బెటర్ బ్యాట్స్‌మెన్.. ధోనీ కంటే బెటర్ కెప్టెన్.. అందుకే రోహిత్ ను..

By BhaaratToday | Published On May 14th, 2019

ఆదివారం జ‌రిగిన‌ ఐపీఎల్ పైన‌ల్లో ముంబై ఇండియన్స్ కి నాలుగోసారి కప్పు క‌ట్ట‌బెట్టిన‌ ముంబై ఇండియన్స్ కెప్టైన్ రోహిత్ శర్మకి టీం ఇండియా  పగ్గాలు అప్పజెప్పాలని ట్విట్టర్ వేదికగా నెటిజన్స్ కోరుతున్నారు. ధోని తరువాత రోహిత్ శ‌ర్మ‌ ఇండియన్ టీం కి బెస్ట్ కెప్టన్ అని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు . 2009 లో గిల్ క్రిస్ట్ నాయకత్వంలో ద‌క్క‌న్ చార్జ‌ర్స్ త‌రుపున‌ తొలిసారి ఐపీఎల్ కప్పును ముద్దాడిన రోహిత్ అ తర్వాత ముంబై ఇండియన్స్ కి పగ్గాలు చేప‌ట్టాడు. 

2013లో రోహిత్ మొదటిసారిగా ముంబై ఇండియన్స్ కి ట్రోఫీని అందించాడు. తర్వాత 2015లో ముంబైకి టైటిల్ అందించిన హిట్ మ్యాన్.. 2017, 2019ల్లో ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరుల‌లో ఒక్క పరుగు తేడాతో తన జట్టును విజేతగా నిలిపాడు. ఐతే ధోనీ తర్వాత భారత్‌కు మెరుగైన కెప్టెన్ రోహితేనని గతంలో సెహ్వాగ్ చెప్పిన విషయాన్ని నెటిజ‌న్లు గుర్తు చేస్తున్నారు. 

రోహిత్ పై నెటిజ‌న్ల ట్వీట్లు.. కోహ్లీ కంటే బెటర్ బ్యాట్స్‌మెన్, ధోనీ కంటే బెటర్ కెప్టెన్ అతడంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ సీజన్ లో చెన్నై పై ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ ముంబైదే పై చేయి.. రోహిత్ మరోసారి తనేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. కానీ బీసీసీఐ పట్టించుకోవడం లేదని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.