Saturday, December 07, 2019
Follow Us on :

అతనొక్కడే.. వచ్చేశాడు..!

By BhaaratToday | Published On Jul 13th, 2019

సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో భారత్ ఓటమి పాలైంది. ఈ సిరీస్ లో అద్భుతంగా ఆడిన రోహిత్ శర్మ సెమీస్ లో ఒక్క పరుగుకే అవుట్ అవ్వడం.. ఆ తర్వాత అతడు బాధపడుతూ పెవిలియన్ లో కూర్చోవడం మనం చూశాం. రోహిత్ శర్మ అలా బాధపడుతూ ఉంటే భారత్ క్రికెట్ అభిమానుల హృదయాలు కూడా ద్రవించిపోయాయి. ఇక అక్కడ ఉండలేకపోయాడో ఏమో  రోహిత్‌ శర్మ భారత్ కు వచ్చేశాడు. శనివారం తెల్లవారు జామున ముంబై విమానాశ్రయానికి చేరుకున్న రోహిత్‌ కారులో తన నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట భార్య రితిక, కూతురు సమైరా ఉన్నారు.  రోహిత్‌ శర్మ 9 మ్యాచ్‌ల్లో 648 పరుగులు చేసి టాప్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఫైనల్ ఆడుతున్న కివీస్-ఇంగ్లాండ్ జట్లలో ఎవరైనా ఆటగాడు అందుకుంటాడేమో చూడాలి. 

Image result for rohit sharma

ఇక మిగిలిన ఆటగాళ్లను భారత్ కు తీసుకొని రావడంలో బీసీసీఐ సరైన ఏర్పాట్లు చేయలేకపోయింది. ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ స్వదేశానికి తిరిగిరావడానికి టికెట్లను సర్దుబాటు చేయడంలో బీసీసీఐ విఫలమవ్వడంతో వారంతా మాంచెస్టర్ లోనే గడుపుతున్నారు. ఆదివారం వరకు వారు అక్కడే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. బీసీసీఐ అధికారి మాట్లాడుతూ టికెట్లు సర్దుబాటు చేస్తున్నామని తెలిపారు. కొందరు మాత్రమే భారత్ కు తిరిగి వస్తారని మిగిలిన వారు రెండు బృందాలుగా ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్తారని చెప్పుకొచ్చారు.