Monday, November 18, 2019
Follow Us on :

ఢిల్లీ చేరుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌..!

By BhaaratToday | Published On Nov 9th, 2019

మరి కొద్ది నిమిషాల్లో రామ జన్మభూమి అంశంపై దేశ అత్యున్నత న్యాయ స్థానం కీలక తీర్పు వెలువరించనుంది. దీంతో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఢిల్లీ చేరుకున్నారు. తీర్పు అనంతర పరిణామాలపై ఆయన పలువురు ప్రముఖులతో మంతనాలు జరపనున్నారు. ఎపెక్స్‌ కోర్టు తీర్పు ఏదైనా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఇప్పటికే బీజేపీ ఆదేశాలు జారీ చేసింది. ప్రజలంతా సహనంతో ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ కూడా పిలుపునిచ్చారు.