Monday, December 09, 2019
Follow Us on :

నిరాహార దీక్షకు దిగిన అశ్వత్థామరెడ్డి

By BhaaratToday | Published On Nov 16th, 2019

టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఈరోజు ఉదయం మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊర్మిళా నగర్ లోని తన స్వగృహంలోనే నిరాహార దీక్షకు దిగారు. ఇందిరాపార్క్ లో దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయన్ను ప్రాంగణం వద్దకు రానివ్వక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీక్షను దృష్టిలో పెట్టుకుని ఉదయానికే పోలీసులు అశ్వత్థామరెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు భారీ సంఖ్యలో ఊర్మిళా నగర్ లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తనను బలవంతంగా అరెస్టు చేసినా దీక్ష ఆగదని తెలిపారు. 

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 43వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నేడు ‘బస్ రోకో’కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. అశ్వత్థామరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు.