Monday, November 18, 2019
Follow Us on :

రష్యా నుండి వచ్చి కాంచన-3 లో నటించింది.. ఆ ఫోటోగ్రాఫర్ మృగమే..!

By BhaaratToday | Published On Apr 26th, 2019

రి డిజావి అలెగ్జాండ్రా.. రష్యన్ నటి..! ఇండియాలో సినిమా అవకాశాలు దక్కుతాయని భావించి ఇక్కడకు వచ్చింది. అవకాశాలను ఈ మధ్యనే అందుకుంటోంది. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ థ్రిల్లర్ 'కాంచన -3' మూవీలో నలుగురు హీరోయిన్లు నటించారు. ఓవియా, వేదిక, నిక్కి తంబోలితో పాటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో హీరో లారెన్స్‌కు జోడీగా రి డిజావి అలెగ్జాండ్రా కూడా నటించింది. 

అయితే ఆమెకు లైంగిక వేధింపులు మొదలయ్యాయి. రూపేష్ కుమార్ అనే ఫోటోగ్రాఫర్ తనను వేధించినట్లు ఆమె ఆరోపించారు. తనకు చాలా మంది సినిమా వాళ్లతో పరిచయం ఉందని, నీ ఫోటోస్ చూపించి అవకాశాలు వచ్చేలా చూస్తానని చెప్పాడట.. ఆ మాటలు నమ్మింది రి డిజావి అలెగ్జాండ్రా. రూపేష్ కుమార్ ఫోటో షూట్ కోసం వెళ్ళింది, ఫోటో షూట్ అయ్యాక రూపేష్ మరేదో కావాలని అడిగాడు. అందుకు రి డిజావి అలెగ్జాండ్రా ఒప్పుకోలేదు. దీంతో అతడి వేధింపులు మరీ ఎక్కువ అయ్యాయి..  తన కోరిక తీర్చడానికి ఒప్పుకోకపోతే..  ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.అలెగ్జాండ్రా చేస్తున్న ఆరోపణలు నిజమే అని తేల్చిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి రూపేష్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని చెన్నై నగరంలోని పుఢల్ సెంట్రల్ జైలుకు తరలించారు.