Thursday, December 05, 2019
Follow Us on :

ప్రధాని మోదీకి మరో అత్యున్నత పురస్కారం

By BhaaratToday | Published On Apr 12th, 2019

ప్రధానమంత్రి నరేంద్రమోదీని మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ‘ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూ ది అపాజిల్‌’ అవార్డును ఈ ఏడాది భారత ప్రధాని మోదీకి ఇవ్వనున్నట్లు రష్యా రాయబార కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. ‘ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూ ది అపాజిల్‌’ రష్యా దేశ అత్యున్నత పురస్కారం. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో అసాధారణ సేవలు అందించినందుకు గానూ ఈ అవార్డును అందిస్తున్నట్లు రష్యా ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాని మోదీ ఇప్పటికే అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు. గతేడాది దక్షిణకొరియా సియోల్‌ శాంతి బహుమతితో మోదీని సత్కరించగా.. ఇటీవల యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) ఇచ్చే ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం జాయెద్‌ మెడల్‌కు ప్రధాని ఎంపికయ్యారు.