Wednesday, October 16, 2019
Follow Us on :

సాహో.. చివరికి ఇలా..!

By BhaaratToday | Published On Sep 24th, 2019

బాహుబలి తరువాత మళ్ళీ ఆ స్థాయిలోనే తెరకెక్కిన సినిమా సాహో. అయితే సాహో అటు అభిమానుల్ని.., ఇటు ప్రేక్షకుల్ని నిరాశపర్చింది...అనుకున్నంత స్థాయిలో విజయం సాధించడకపోవడంతో ఈ చిత్ర నిర్మాతలకు భారీ షాక్ తగిలింది. అంతేకాకుండా మరోవైపు ఇంకో చెత్త రికార్డుకు సాహో చేరువ అవుతోంది అంటున్నారు..

సాహో.. తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నిర్మించారు...అయితే కధ,కధనం ఎమోషనల్ ఎలిమెంట్ వంటి వివిధ అంశాలతో కనెక్ట్ అయ్యే తెలుగు ఆడియన్స్ సాహో కు కనెక్ట్ కాలేదు.. దాంతో ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో విజయం సాధించలేకపోందనే చెప్పాలి. దాదాపు 300 కోట్ల రూపాయలతో నిర్మించబడ్డ ఈ సినిమా ఆ స్థాయి విజయాన్ని అందుకోవడంలో విఫలం చెందింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా,బాలివుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రమిది. భారీ యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా  తెరకెక్కించారు డైరెక్టర్ సుజీత్... అయితే ఈ చిత్రం విడుదల సమయంలో ఏర్పడిన హైప్ తో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. కానీ ఊహించిన స్థాయి ఫలితాన్ని అయితే అందుకోలేకపోయింది అన్న మాట వాస్తవం.దాంతో లాభాల మాట పక్కన పెడితే పెట్టుబడి అయిన వస్తే చాలు అనుకుంటున్నారు మేకర్స్. సాహో సినిమా టాలీవుడ్ లోని భారీ నష్టాలను మిగిల్చిన చిత్రాల జాబితాలోకి చేరనుంది అని సినిమా విశ్లేషకులు అంటున్నారు...సాహో మొత్తం పెట్టుబడి 300 కోట్లు....అయితే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్  424 కోట్లు కలెక్ట్ చేసింది...ఇక షేర్ మాత్రం 250 కోట్లు వసూలు చేసింది...దీంతో సాహో కు ఇప్పుడు ఎలా లేదన్నా తెలుగులో 60 కోట్లకు పైగానే నష్టాలు వచ్చేలా ఉన్నాయని తెలుస్తుంది.

 ఇప్పటికి భారీ నష్టాలు మిగిల్చిన సినిమాల  జాబితాలో సూపర్ స్టార్ మహేష్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు నటించిన సినిమాలు టాప్ లో ఉండగా వాటి తర్వాత స్థానం సాహో దక్కించుకునేలా ఉందని అంటున్నారు...ఒకవైపు రాజమౌళితో సినిమా తరువాత ఏ హీరోకైనా ఫ్లాప్ తప్పదు అనే నానుడిని నిజం చేసి... బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గానే మిగిలిపోవాల్సి వస్తుంది సాహో మూవీ.