Saturday, December 14, 2019
Follow Us on :

సాహోకు ఇలా జరిగిందేమిటి

By BhaaratToday | Published On Aug 30th, 2019

ప్రభాస్ తాజా చిత్రం 'సాహో'  చిత్రం విడుదలై కొన్ని గంటలు కూడా కాలేదు. అప్పుడే పైరసీ చేసేశారు. సాహో టీమ్ కు ఊహించని షాక్ ఇస్తూ సినిమా విడుదలైన గంటల వ్యవధిలోనే ఈ చిత్రం ఆన్ లైన్లో దర్శనమిచ్చింది. తమిళ్ రాకర్స్ అనే వెబ్ సైట్ ఈ చిత్రాన్ని లీక్ చేసింది. హైక్వాలిటీ ఉన్న 'సాహో' చిత్రం ఆన్ లైన్లోకి వచ్చేసింది. పైరసీని అడ్డుకోడానికి సాహో టీమ్ ఏమి చేయాలో ఏమో..!

 'సాహో' చిత్రం కోసం తాము రెండేళ్లకు పైగా సమయం వెచ్చింది తీవ్రంగా కష్టపడ్డామని, ఇప్పుడు తమ కష్టాన్ని ప్రేక్షకుల ముందు ఉంచామని హీరోయిన్ శ్రద్ధా కపూర్ తెలిపారు.  'సాహో' సినిమా మీది. దయచేసి అసత్య ప్రచారం చేయొద్దు, పైరసీని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దని శ్రద్ధా కపూర్ విజ్ఞప్తి చేశారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిన చిత్రాన్ని థియేటర్లలోనే చూడండి అని శ్రద్ధా కపూర్ అభిమానులను కోరారు.