Monday, December 16, 2019
Follow Us on :

సాహో ట్రైలర్.. గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టే వాడికే ఒక రేంజి ఉంటది.. !

By BhaaratToday | Published On Aug 10th, 2019

సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సాహో..! బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను ఎప్పుడు వెండితెర మీద చూస్తామా అని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. షేడ్స్ ఆఫ్ సాహో, టీజర్ లకు ఇప్పటికే భారీ రెస్పాన్స్ వచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేస్తామని మొదట నిర్మాతలు ప్రకటించారు. అయితే క్వాలిటీ పరంగా ఎటువంటి మాట పడకూడదని.. ఇంకో రెండు వారాలు సమయం తీసుకొని ఆగస్టు 30న సినిమా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఒక్కో క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు.     

ఇక ఈరోజు విడుదలైన ట్రైలర్ లో భారీ రెస్పాన్స్ వస్తోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో ట్రైలర్ ను అద్భుతంగా రూపొందించారు. ఛేజింగ్ సీన్స్ హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోలేదు. డార్లింగ్ ప్రభాస్ కూడా ఫైట్స్ అదరగొట్టేశాడు. సినిమాటోగ్రఫీ కూడా సూపర్ అంటున్నారు ట్రైలర్ చూసిన వాళ్ళు. ఎడారి ఫైట్ ను వెండితెర మీద చూడడానికి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 30న భారీగా దక్షిణాది భాషల్లోనూ, హిందీ లోనూ సాహో విడుదల కాబోతోంది. ఇక ఈ డై హార్డ్ ఫ్యాన్స్ సినిమాను ఏ రేంజ్ హిట్ చేస్తారో చూడాలి. 

రన్ రాజా రన్ సినిమా దర్శకుడు సుజీత్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రభాస్‌కి జోడీగా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటించింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు.