Tuesday, May 21, 2019
Follow Us on :

సచిన్, లక్ష్మణ్ లకు నోటీసులు..!

By BhaaratToday | Published On Apr 25th, 2019

సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌ లకు బీసీసీఐ అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ నోటీసులు జారీ చేశారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ లో సభ్యులుగా ఉంటూ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు మెంటర్స్‌ గా ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యేక ప్రయోజనాలు పొందుతున్నారనే ఆరోపణలపై ఈ నోటీసులు పంపారు.  

Related image

భారత జట్టుకు కోచ్‌ నియామకంతో పాటు మరి కొన్ని కీలక నిర్ణయాల కోసం బీసీసీఐ కొన్నేళ్ల కిందట సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌లతో క్రికెట్‌ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఫ్రాంచైజీలకు మెంటర్స్‌గా ఉంటూ ఈ కమిటీలో ఎలా కొనసాగుతారంటూ బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ సచిన్‌, లక్ష్మణ్‌లకు నోటీసులు పంపారు. ఈ నోటీసులకు సచిన్, లక్ష్మణ్ ఈనెల 28లోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.  ఇప్పటికే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ ఈ విషయంలో నోటీసులు అందాయి. గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్అధ్యక్షుడిగా, సీఏసీ సభ్యుడిగా, ఢిల్లీ క్యాపిటల్స్‌కి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. 

Image result for sachin laxman

అయితే వీరంతా బీసీసీఐకు సేవలందిస్తున్నప్పటికీ ఎలాంటి జీతం తీసుకోవడం లేదు. అయినప్పటికీ నోటీసులు అందాయి.