
సచిన్ టెండూల్కర్.. క్రికెట్ దేవుడు.. ఈ ఆటలో ఆయన తర్వాతే ఎవరైనా..! ఆట నేర్చుకోవాలన్నా అతడి గురించి తెలుసుకోవాల్సిందే.. విజ్ఞతతో ఎలా మెలగాలన్నా అతని తీరును గమనించాల్సిందే. క్రికెట్ లో ఆయన ఒక ఎవరెస్టు..! అద్భుతమైన బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు వేస్తున్న సమయంలోనే సచిన్ వారిని చీల్చి చెండాడాడు. ఇక ఆయన వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..!
సచిన్ టెండూల్కర్ ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హాల్ ఆఫ్ ఫేమ్ లో స్థానం కల్పించింది. క్రికెట్ కు వన్నె తీసుకురావడమే కాకుండా, ఆట అభివృద్ధికి కృషి చేశాడంటూ ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు లండన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సచిన్ కు ఐసీసీ జ్ఞాపికను బహూకరించింది. సచిన్ మాట్లాడుతూ, దీనిని జీవితకాలంలో తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తానని తెలిపాడు. ఎంతో కాలంగా తన వెన్నంటి నిలిచిన కుటుంబసభ్యులు, అభిమానులు, ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలిపాడు. ట్విట్టర్ లో కూడా సచిన్ ఐసీసీకి ధన్యవాదాలు తెలిపాడు.
Humbled and happy to be inducted into the #ICCHallOfFame.
— Sachin Tendulkar (@sachin_rt) July 19, 2019
A lot of people have contributed towards helping me become who I am today.
A big thank you to my family, friends & fans across the globe for the love & support.
Congratulations to Cathryn Fitzpatrick & @AllanDonald33. https://t.co/F0o7W6TJP5