Saturday, August 24, 2019
Follow Us on :

సాహో అంటూ వచ్చేశాడు.. భారీ యాక్షన్ సీన్స్

By BhaaratToday | Published On Jun 13th, 2019

సాహో.. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ఇది..! ఈ సినిమా రిలీజ్ కోసం యావత్ భారతదేశం ఎంతగానో ఎదురుచూస్తోంది. ఇక ఇప్పటికే షేడ్స్ ఆఫ్ షాడో, చాప్టర్స్ 1, చాప్టర్ 2, ఫస్ట్ లుక్, యాక్షన్ సీక్వెన్సులకు సంబంధించిన వీడియోలు చూస్తే ఈ సినిమాను హాలీవుడ్ రేంజిలో రూపొందిస్తున్నారంటూ తేల్చేశారు.  

ఇక డార్లింగ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూన్ 13 ఉదయం 11.23 గంటలకు ‘సాహో’ టీజర్‌ను విడుదల చేశారు. స్టైలిష్ లుక్ లో, యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ ఇరగదీశాడు. 

తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో వస్తున్న ఈ సినిమాకు ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో అధినేతలు వంశీ, ప్రమోద్, విక్కీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. 

ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కాబోతోంది.. టీజర్ చూశాక మాత్రం ఎంత తొందరగా వచ్చేస్తుందా ఆ రోజు అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.