Thursday, April 25, 2019
Follow Us on :

సాయి ధరమ్ తేజ్ పేరు మార్చుకున్నాడట.. నిజమేనా

By BhaaratToday | Published On Mar 20th, 2019

సాయి ధరమ్ తేజ్.. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత కొంత కాలంలోనే స్టార్ హోదాని దక్కించుకుంటాడు అని అనుకున్నారు. కానీ అది జరగలేదు.. ఆ తర్వాత వరుస ఫ్లాప్ లు.. విన్నర్, జవాన్ లాంటి సినిమాలను సెలెక్ట్ చేసుకున్నప్పుడు అభిమానులే సాయి ధరమ్ తేజ్ ను విపరీతమైన కామెంట్స్ చేశారు. అయితే ఆరు ఫ్లాప్ లు వచ్చినా సాయి ధరమ్ తేజ్ మార్కెట్ ఏ మాత్రం తగ్గలేదు. 'చిత్రలహరి' సినిమాకు ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.     

ఈ సినిమా కోసం తన పేరును సైతం మార్చేశాడు. ఇప్పటి వరకు అన్ని సినిమాల్లో అతని స్క్రీన్ నేమ్ సాయి ధరమ్ తేజ్ అని పడేది. 'చిత్రలహరి'లో మాత్రం కేవలం సాయి తేజ్ అని పడుతోంది. లక్ కోసమే ఆయన తన పేరును ట్రిమ్ చేశారని అంటున్నారు. చూద్దాం రిజల్ట్ ఎలా వస్తుందో..! ‘చిత్రలహరి’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘నేను శైల‌జ’ వంటి యూత్‌ఫుల్ లవ్‌స్టోరీని అందించిన కిషోర్ తిరుమ‌ల ద‌ర్శక‌త్వంలో ‘చిత్రలహరి’ తెరకెక్కుతోంది.