Wednesday, October 16, 2019
Follow Us on :

నక్సలైట్‌ పాత్రలో‘సాయిపల్లవి’..!

By BhaaratToday | Published On Jan 27th, 2019

మ‌ల‌యాళీ భామ సాయి ప‌ల్లవి ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైంది. అందంతో పాటు మంచి అభిన‌యం ఉన్న ఈ న‌టి ఇటు తెలుగు, త‌మిళ భాష‌ల‌లో వ‌రుస సినిమాల‌తో ఆక‌ట్టుకుంటోంది. ఇటీవ‌ల ప‌డిప‌డిలేచే మ‌న‌సు అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించింది సాయి ప‌ల్ల‌వి. త్వ‌ర‌లో నీదీ నాదీ ఒకే కథ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం 1992 అనే చిత్రం చేయ‌నుంది. ఈ సినిమాలో రానా ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా ఆయ‌న‌ సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె నక్సలైట్ గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని చెబుతున్నారు. మ‌రి తొలి చిత్రంతో మంచి హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు రానా, సాయి ప‌ల్ల‌వి వంటి స్టార్ ఆర్టిస్ట్స్‌తో సినిమాని ఏ రేంజ్‌లో తీస్తాడో చూడాలి మ‌రి. ప్రస్తుతం తమిళంలో సూర్య సరసన ఎన్ జి కె చిత్రంలో నటిస్తుంది సాయిప‌ల్ల‌వి.