Tuesday, September 24, 2019
Follow Us on :

ఇలా చేస్తే కశ్మీర్ సమస్య తీరుతుందన్న సల్మాన్ ఖాన్

By BhaaratToday | Published On Mar 21st, 2019

కశ్మీర్ సమస్య.. భారత్ కు చెందిన భూభాగాన్ని లాక్కోవడం కోసం పాకిస్థాన్ ఇప్పటికే ఎన్నో కుట్రలను చేసింది.. చేస్తూనే ఉంది. అక్కడి ప్రజలను భారత్ మీద.. భారత ఆర్మీ మీద రెచ్చగొడుతూ పబ్బం గడుపుతున్నారు కొందరు వేర్పాటువాదులు. అయితే కశ్మీర్ సమస్యను తీర్చడం కోసం ఎందరో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ సమస్య పరిష్కారానికి ఓ సూచన చెప్పాడు.   


క‌శ్మీర్ యువ‌త‌కు స‌రైన విద్య‌ను అందిస్తే ఆ స‌మ‌స్య తీరుతుంద‌ని అత‌ను అన్నారు. విద్య‌ను అందిస్తే క‌శ్మీర్‌లో మార్పులు వ‌స్తాయా అని ప్ర‌శ్నకు బదులుగా   స‌రైన విద్య‌ను అందిస్తే క‌శ్మీర్‌లో మార్పులు సాధ్య‌మేనని స‌ల్మాన్ అన్నాడు.  పుల్వామాలో దాడికి పాల్ప‌డింది ఓ స్థానిక ఇంజనీరింగ్ విద్యార్థి. అత‌ను విద్య‌ను అభ్య‌సించాడు, కానీ అత‌ని ట్యూట‌ర్లు, టీచ‌ర్లు స‌రైన ప‌ద్ధ‌తిలో చ‌దువును చెప్ప‌లేద‌న్నారు. 

స‌ల్మాన్ నిర్మించిన  'నోట్‌బుక్' సినిమా ఈనెల 29వ తేదీన విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా సల్మాన్ ఖాన్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.