Wednesday, October 16, 2019
Follow Us on :

సల్మాన్ ఖాన్ 'భరత్' టీజర్..!

By BhaaratToday | Published On Jan 25th, 2019

సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న భరత్ సినిమా టీజర్ విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ కు జోడీగా కత్రినా కైఫ్ నటించింది.1:26 నిమిషాల టీజర్ లో సల్మాన్ ఖాన్ విభిన్న గెటప్ లలో కనిపించాడు. అలాగే భారీ డైలాగ్ లు.. ఓ స్టంట్ ను టీజర్ లో చూపించారు. ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించాడు. గతంలో సల్మాన్ ఖాన్ కు సుల్తాన్, టైగర్ జిందా హై లాంటి హిట్స్ ఇచ్చాడు. దీంతో భరత్ మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో టబు, దిశా పటానీ, ఆసిఫ్ షేక్, సునీల్ గ్రోవర్, జాకీ ష్రాఫ్ లాంటి పలువురు స్టార్లు నటించారు. ఈ ఏడాది ఈద్ సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయనున్నారు.