Thursday, August 22, 2019
Follow Us on :

స‌మంత వ‌న్ బ‌కెట్ ఛాలెంజ్‌.. నాతో పాటు ఎవ‌రు?

By BhaaratToday | Published On Jul 19th, 2019

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈసారి నీటి ఎద్ద‌డితో నగ‌ర‌ ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. చాలా చోట్ల క‌నీసం త్రాగునీరు లేకుండా.. వాటి కోసం మైళ్ల దూరం న‌డుస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో ప్ర‌జ‌ల్లో నీటి సంర‌క్ష‌ణ‌పై అవ‌గాహ‌న క‌ల్పిండానికి హైద‌రాబాద్‌లో ఆదివారం రోజున `వ‌న్ బ‌కెట్ ఛాలెంజ్‌`ను స్టార్ట్ చేశారు. ఆ ఛాలెంజ్‌ను స్వీక‌రించ‌డానికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ముందుకు వ‌చ్చారు. 

అయితే.. ఈ ఛాలెంజ్ ప్ర‌కారం స‌మంత‌ జూలై 21న కేవ‌లం ఒక బ‌కెట్ నీటినే వాడుతారు. ఇదే విష‌య‌మై.. `నాతో పాటు ఎవ‌రు ఉంటారు? ఆదివారం వ‌న్‌బ‌కెట్ ఛాలెంజ్‌ను ఎవ‌రు స్వీక‌రిస్తారు? ఎక్కువ సేపు స్నానం చేయ‌కూడ‌దు. వాహ‌నాల‌ను క‌డగ‌వ‌ద్దు. నా ఛాలెంజ్‌ను నేను పోస్ట్ చేస్తా.. మీరెవ‌రూ మోసం చేయ‌కండా.. ప్ర‌తి చుక్కా లెక్కే. ` అంటూ ట్విట్ట‌ర్ ద్వారా ఛాలెంజ్ విష‌యాన్ని తెలియ‌జేస్తూ మెసేజ్ పోస్ట్ చేశారు. దీనికి  టాలీవుడ్ హీరోలు వ‌రుణ్‌తేజ్‌, నాగ్ అశ్విన్‌, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌లు స‌మంత ఛాలెంజ్‌కు ట్విట్ట‌ర్ ద్వారా త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేశారు.