Thursday, August 22, 2019
Follow Us on :

ఆ క‌థ‌నం రాసింది పాకిస్థానీ.. అప్పుడు కూడా ఇలాంటి రాత‌లే..

By BhaaratToday | Published On May 11th, 2019

మోదీని 'భారత ప్రధాన విభజనదారు'గా అభివర్ణిస్తూ 'టైమ్' మ్యాగజైన్‌లో కథనం రాసిన వ్యక్తి పాకిస్థానీ అని, బాలాకోట్ లోని జైషే ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన జరిపిన దాడుల కారణంగానే వాళ్లు ప్రధానిపై ద్వేషం పెంచుకున్నారని బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర తెలిపారు. శనివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా మోదీపై ఇలాంటి రాతలే రాశారని, ఈసారి అదే పునరావృతమైందని అన్నారు. 

ప్రధాని మోదీ 17 రకాలైన పన్నులను ఏకీకృతం చేసి జీఎస్‌టీని తీసుకువచ్చిన 'ఏకీకృతవాది' అని సంబిత్ పాత్ర చెప్పారు. కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్‌ సిద్ధూ చేసిన పలు వ్యాఖ్యలపై సంబిత్ పాత్ర విరుచుకుపడ్డారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై సిద్ధూ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. మోదీని, ఇతర బీజేపీ నేతలను సిద్ధూ 'నల్ల ఆంగ్లేయుల'తో పోల్చడం సరికాదన్నారు. ఇది దేశాన్ని ప్రేమించే మోదీని, మోదీని అపారంగా అభిమానించే ప్రజలను అవమానించడమేనని సిద్ధూపై నిప్పులు చెరిగారు.