Saturday, August 24, 2019
Follow Us on :

భారత్-పాక్ మ్యాచ్ టీవీ యాడ్స్ పై సానియా గుస్సా..!

By BhaaratToday | Published On Jun 13th, 2019

వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు జూన్ 16న తలపడనున్నాయి. ఇందుకోసం పోటాపోటీగా టీవీ యాడ్స్ ను రెడీ చేస్తున్నారు. ఇరు దేశాల్లోనూ ఇదే పద్ధతి కొనసాగుతోంది. కొందరైతే చాలా చీప్ యాడ్స్ కూడా చేశారు. అందులో అభినందన్ కు స్పందించిన స్పూఫ్ కూడా ఒకటి..! ఇక భారత్ లో కూడా చాలా యాడ్స్ వచ్చాయి. ఈ యాడ్స్ పై ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అసహనం వ్యక్తం చేశారు.

Image result for sania mirza

"ఈ మ్యాచ్ ను సొమ్ము చేసుకోవడానికి ఇంత చెత్తను యాడ్స్ రూపంలో గుప్పించనవసరంలేదు. ఇప్పటికే భారత్-పాక్ మ్యాచ్ లకు కావాల్సినంత ప్రచారం లభించింది. ఈ విషయాన్ని సీరియస్ గానే చెబుతున్నాను. సరిహద్దుకు అటూ ఇటూ రెండు వైపుల నుంచి చిరాకుతెప్పించేలా యాడ్స్ వస్తున్నాయి. ఇదో ప్రముఖమైన మ్యాచ్. అంతకన్నా ఎక్కువే అని మీరు భావిస్తుంటే మాత్రం మిమ్మల్ని మీరు కట్టడి చేసుకోవాల్సిన అవసరం ఉంది" అంటూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా యాడ్స్ హద్దులు మీరుతున్నాయన్నది సానియా చెప్పాలనుకున్న టాపిక్..! ఇకనైనా యాడ్స్ రూపకల్పనలో మార్పులు వస్తాయో లేదో చూడాలి. 

Image result for sania mirza

వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా ఈ ఆదివారం ఇండియా, పాకిస్థాన్ జ‌ట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పై ఇప్పటికే ఇరు దేశాల్లోనూ యాడ్స్ మారుమ్రోగిపోతున్నాయి. అయితే పాకిస్థాన్ లో మాత్రం ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న కోసం వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ సంఘ‌ట‌న‌కు స్పూఫ్ చేశారు. అభినంద‌న్ పాక్ ద‌ళాల‌కు చిక్కిన తర్వాత పాక్ అధికారులు ఆయ‌న్ను ప్ర‌శ్నించారు. టీ తాగుతూ అభినంద‌న్ పాక్ అధికారుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చాడు. అచ్చం అలాంటిదే అభినందన్ లాంటి స్టైల్ లో మీసాలు ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చి ఓ యాడ్‌ను రూపొందించారు. 

Image result for sania mirza

అభినంద‌న్ లుక్‌లో ఉన్న అతడికి ఇండియా క్రికెట్ జ‌ట్టు ధ‌రించే జెర్సీని వేశారు. ఆ త‌ర్వాత అతడిని కొన్ని ప్రశ్నలు అడిగారు. టాస్ గెలిస్తే ఏం చేస్తారని ఆ వ్య‌క్తిని అడిగితే.. ఐయామ్ సారీ నేనేమీ చెప్ప‌కూడ‌దంటూ ఆ వ్య‌క్తి అంటాడు. ప్లేయింగ్ లెవెన్ లో ఎవరు ఉంటారు అని అడగ్గా..  ఐయామ్ సారీ నేనేమీ చెప్ప‌కూడ‌దంటూ మళ్ళీ  ఆ వ్య‌క్తి అంటాడు. సర్లే టీ ఎలాగుంది అని అడుగుతారు.. టీ బాగుంది అని అక్కడి నుండి వెళ్ళిపోబోతుంటే  ఆ క‌ప్పును ఎక్క‌డికి తీసుకు వెళ్తున్నావంటూ వెనక్కు లాగేసుకుంటారు. అంటే భారత జట్టుకు కప్ దక్కకుండా పాకిస్థాన్ చేస్తుంది అన్నది ఆ యాడ్ ఉద్దేశ్యం. అయితే పాకిస్థాన్ ఇప్పటి వరకూ భారత్ మీద వరల్డ్ కప్ లో గెలవలేదన్నది వారికి తెలిసే ఉంటుంది. ఈ యాడ్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.