Thursday, December 12, 2019
Follow Us on :

'శరవణ భవన్' రాజగోపాల్ క‌న్నుమూత‌

By BhaaratToday | Published On Jul 18th, 2019

ప్రఖ్యాత హోటల్ శరవణ భవన్ యజమాని రాజగోపాల్ క‌న్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో  చెన్నై అసుపత్రిలో  చికిత్స పొందుతున్న రాజగోపాల్‌ గురువారం మరణించారు. 1981లో చెన్నైలో తొలిసారి హోటల్ శరవణ భవన్‌ను స్థాపించాడు. అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి విదేశాల్లోనూ తన హోటల్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ క్రమంలో తన వద్ద పనిచేస్తున్న వివాహితను పెళ్లాడితే తన ప్రభ మరింత వెలిగిపోతుందన్న ఓ జ్యోతిష్యుడి సలహాతో ఆమె వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న రాజగోపాల్ ప్రతిపాదనను ఆమె అంగీకరించలేదు. దీంతో ఆమె భర్తను అడ్డు తొలగించుకుని ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో వివాహిత భర్తను కిరాయి గూండాలతో హత్య చేయించాడు. ఈ కేసులో రాజగోపాల్‌ను దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు జీవిత శిక్ష విధించింది. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురికావడం, గుండెపోటుతో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను విజయ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయ‌న‌కు తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చారని, పరిస్థితి విషమించి మరణించారని వైద్య వర్గాలు తెలిపాయి. ఆమె భర్తను కిరాయి గుండాలతో దారుణంగా హత్య చేయించిన  రాజగోపాల్‌ కథ ముగిసింది.