Thursday, August 22, 2019
Follow Us on :

కొద్ది రోజుల క్రితమే ఆక్సిజన్ మాస్క్ తో లొంగిపోయిన శరవణ భవన్ అధినేత.. ఇప్పుడేమో

By BhaaratToday | Published On Jul 15th, 2019

హత్య కేసులో దోషిగా తేలడంతో కొద్ది రోజుల క్రితం శరవణ భవన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ యజమాని పి.రాజగోపాల్ ఆక్సిజన్ మాస్క్‌తో వచ్చి కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. తనకు విధించిన జీవిత ఖైదును ఆలస్యంగా ప్రారంభించాల్సిందిగా ఆయన చేసుకున్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు  తోసిపుచ్చడంతో కోర్టులో లొంగిపోయారు. ఆయన ఆక్సిజన్ మాస్క్‌తో, అంబులెన్స్‌లో వచ్చి చెన్నై సెషన్స్ కోర్టులో లొంగిపోయారు. 

ఇప్పుడు రాజగోపాల్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. చెన్నైలోని స్టాన్లీ వైద్యశాలలో ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం పుళల్ జైలుకు తరలించడానికి ముందు వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ని స్టాన్లీ వైద్యశాలకు పోలీసులు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడ్డాడట రాజగోపాల్. రాజగోపాల్ కు షుగర్, కిడ్నీ వ్యాధులు ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాజగోపాల్ కు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని.. ఆయన పల్స్ రేట్ పడిపోయిందని, ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది.  

శరవణ భవన్ హోటల్ యజమాని రాజగోపాల్ చిన్న హోటల్ స్థాయి నుండి దక్షిణాదిన ఫేమస్ హోటల్ స్థాయికి తీసుకొని వచ్చారు. కానీ ఆయన ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటలు విని ఇప్పుడు జైలుపాలయ్యాడు.  రాజగోపాల్ కు ఇద్దరు భార్యలు.. అప్పటికే ఆయన హోటల్ కు మంచి పేరు వస్తోంది. ఒక రేంజిలో ఆదాయం దక్కుతోంది కూడా..! కానీ 2001 లో ఓ జ్యోతిష్యుడి మాట నమ్మి రాజగోపాల్ ఓ తప్పును చేశారు. రాజగోపాల్ కు ఓ అమ్మాయిని చూపించిన జ్యోతిష్యుడు ఆ అమ్మాయిని మూడో భార్యగా చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందని చెప్పాడు. ఆ మాటలను రాజగోపాల్ నమ్మాడు. ఆ అమ్మాయికి పెళ్లయిందన్న విషయాన్ని కూడా మరచిపోయాడు అతడు. ఆమెకు రాజగోపాల్ విషయం చెప్పాడు. కానీ ఆమె అతడి నీచపు కోరికకు అంగీకరించలేదు. దీంతో రాజగోపాల్ లోని రాక్షసుడు బయటకు వచ్చాడు. ఆమె భర్తను 2001లో దారుణంగా చంపించాడు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. రాజగోపాల్ తన పలుకుబడితో చాలా ఏళ్ళు ఆ కేసును సాగదీశాడు. ఎట్టకేలకు అతడికి పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఇలాంటి వాళ్లకు ఈ శిక్ష చాలదని.. యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది.  

कभी सब्जी बेचकर बना था अरबपति, लड़की के चक्कर में बर्बाद कर ली जिंदगी