Tuesday, June 18, 2019
Follow Us on :

రజనీ, కమల్ లపై సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు

By BhaaratToday | Published On Jun 10th, 2019

దక్షిణాది నటుడు సత్యరాజ్.. రాజకీయాలపై తనదైన శైలిలో ఎప్పుడూ స్పందిస్తూ ఉంటారు. సత్యరాజ్ ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలపై ఎప్పటికప్పుడు తన వైఖరిని చెప్పుకుంటూ వస్తుంటారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదం కూడా అయ్యాయి. అయితే ఆయన ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కూడా అదే తరహాలో తమిళనాడులో కలకలం రేపాయి. రజనీకాంత్ ను ఏకంగా స్థానికేతరులు అంటూ సంబోధించాడు. ఎందుకంటే రజనీకాంత్ మరాఠీ వ్యక్తి.. అయినప్పటికీ రజనీకాంత్ ను తమిళ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. త్వరలో ఆయన రాజకీయాల్లోకి కూడా రాబోతున్నారు. ఇటువంటి తరుణంలో రజనీపై సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు ఎటువంటి దుమారం రేపుతాయో చూడాలి.    

ఇంతకూ సత్యరాజ్ రజనీకాంత్ ను ఎందుకు ఆ మాట అన్నారంటే.. ఇటీవల రజనీకాంత్ మాట్లాడుతూ తమిళనాడులో రాజకీయ శూన్యత ఉందన్నారు. దీనిపై సత్యరాజ్ మాట్లాడుతూ తమిళనాడులో ఎలాంటి రాజకీయ శూన్యత లేదని ఓటర్లు నిరూపించారని.. ప్రజలంతా స్టాలిన్ ను నమ్ముతున్నారని బదులిచ్చారు. స్థానికేతరులు ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరంలేదని చెప్పారు. కొత్తగా పార్టీ పెట్టినవారు కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని, ఎన్నికల్లో విఫలం అయ్యారని కమలహాసన్ ను ఉద్దేశిస్తూ కామెంట్లు చేశారు.